ABOUT US :

ప్రకృతి జీవన విధానం ఫాలోయర్స్ అసోసియేషన్ కార్యక్రమములు

     ప్రకృతి జీవన విధానంలో భాగంగా "అందరికి ఆరోగ్యం" అందించాలనే ఉద్దేశ్యంతో ఈ అసోసియేషన్ ను 2004 లో స్థాపించారు. అసోసియేషన్ లో భాగంగా కొన్ని కార్యక్రమాలు నిరవధికంగా జరుగుతున్నాయి.

1. ప్రెవెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్ అనే మాటతో, మీ ఆరోగ్యం మీ దైనందిన పద్దతుల ద్వారా అందరికి అందుబాటులోకి రావాలని ఆకాంక్ష.

2. ఈ ఆకాంక్షలో భాగంగా అందరికి అందుబాటులో భోజనశాల ఏర్పాటు చేయబడినది. ఉదయం. 6. గం. ల నుంచి అల్పాహారం, మొలకలు, వెజిటబుల్ జ్యూస్ మరియు 11.30 గం. ల నుంచి ప్రకృతి ఆహారం ముడిబియ్యపు అన్నం, ఉడక బెట్టిన కూరగాయల కూర, ఆకుకూర, పుల్కాలతో చేసిన భోజనం, సాయంత్రం 5. గం. ల నుంచి 7.౦౦ గం. ల వరకు పుల్కాలు, ఫైబర్ గల కూర ఏర్పాటు చేయబడినది.

3. ప్రకృతి జీవన విధానం ఫాలోయర్స్ అసోసియేషన్ స్వయంగా మంచితేనే, గోధుమ గడ్డి పౌడర్, సెంద్రీయ ఎరువులతో పండించిన ముడి బియ్యం,  మొలకెత్తిన విత్తనాలు పంచదార బెల్లం లేకుండా నేచురల్ స్వీట్స్ ఆరోగ్య పరి రక్షణలో భాగంగా ఉపయోగించే చిన్న చిన్న పరికరాలను ఉప్పు, నూనే లేకుండా వందుటకు గాను, శరీర ఆరోగ్య పోషణలో ఉపయోగించే కొన్ని పదార్ధాలను అందరికి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో స్టోర్ ఏర్పాటు చేయమడినది.

4. ప్రకృతి జీవన విధానాన్ని ఆచరించేవారికి ప్రతినెల 1వ ఆదివారము ఆరోగ్య ప్రసంగం ఏర్పాటు చేయబడినది.

5. విజయవాడలో 10 ఎకరాల భూమి తీసుకుని అందులో సెంద్రీయ పద్దతులలో  రకరకాల కూరగాయలను పండ్లను పండిస్తూ కొద్ది మొత్తంలో అందించడం జరుగుతున్నది.

 

 
All copy Rights Reserved Designed by Futuristic