ఓట్స్ వలన ఉపయోగాలు

ఆరోగ్యవంతమైన గుండె

బ్లడ్ కోలెస్టరాల్ని నిర్ణీతమైన స్థాయిలో ఉంచుతూ, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని నిరూపించబడిన సాల్యుబుల్ (సమీళితమగు పీచు పదార్ధము) ఫైబర్గల ఉతమమైన ఆహార వనరులలో ఓట్స్ ఒకటి.

బ్లడ్ షుగర్ నియంత్రణ

సాల్యుబుల్ ఫైబర్‌లు (సమీళితమగు పీచు పదార్ధము) ఉదరము నుండి ఆహారము విడుదల అయ్యే వేగాన్నీ తగ్గిస్తాయి మరియు చిన్న ప్రేగులు ఆహారాన్ని సంగ్రహించే వేగాన్నీ తగ్గిస్తాయి. అంధూవల్ల, భోజనం తీసుకొన్న వెనువెంటనే ఉత్పన్నమయ్యే ఫ్లాస్మా గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ వెల్లువ తగ్గి, రక్తంలో గ్లూకోజ్ స్థాయీలు నియంత్రణలో ఉండటానికి అవకాశముంటుంది.

రక్త పోటు నియంత్రణ

సాల్యుబుల్ ఫైబర్ పుష్కలంగా ఉండే ఓట్స్ను అనునిత్యం తీసుకోవటం వల్ల, హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు తగ్గుతుంది.

క్యాన్సర్ ప్రమాదమును తగ్గిస్తుంది.

ఇతర ధాన్యములు మరియు కూరగాయల మాదిరిగా ఓట్స్‌లో వందల కొద్దీ ఫైతోకెమికల్స్ (ప్లాంట్కెమికల్స్) ఉంటాయి. వ్యక్తి క్యాన్సర్ బారిన పడే అవకాశాలను ఇవి తగ్గిస్తాయి.

బరువు నియంత్రణ

జీర్ణం అయిన సాల్యుబుల్ ఫైబర్, ఒక జెల్ రూపాన్ని సంతరించుకొని, ఉదరము మరియు చిన్న ప్రేగుల సాంధ్రత (చిక్కదనాన్ని) పెంపొందిస్తుంది. ఈ జెల్, ఉదరము ఖాళీ అవటాన్ని జాప్యం చేస్తుంది, తద్వారా మీరు సదా శక్తి కలిగి ఉంటారు, అందువలన బరువు తగ్గడానికీ ఆస్కారముంటుంది.


 
All copy Rights Reserved Designed by Futuristic