సంపూర్ణ ఆరోగ్యానికి గోధుమగడ్డి పౌడరు

ఆధునికయుగంలోన ప్రకృతి ప్రసాదించిన గొప్ప పోషకాహారం లేత గోధుమ ఆకులతో ఆరోగ్య పరిరక్షణకు అవసరమగు విటమిన్స్, మినరల్స్, ఆమినోఆసిడ్స్, మైక్రో న్యూట్రియాంట్స్, ఫైబర్ మరియు క్యాన్సర్ కణాలను నిరోధించే లెట్రయిల్ (బి 17) మొదలగు 90 రకాల ప్రకృతి సిద్దమైన మూలికల శక్తి ఇమిడి ఉంది.

లేత గోధుమ ఆకుల పౌడర్ కొత్త రక్తాన్ని అభివృద్ధి చేసి అన్ని జీవకణాలకు అందించి అందులో నిల్వ ఉన్న ఉప్పునీరు, రసాయనాలు, లోహాసంబంధాలు మత్తుపదార్ధాలు, వ్యర్ధాలను బయటకు పంపించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గోధుమ ఆకుల పౌడరు వాడినట్లైతే మలబద్ధకాన్ని పోగడుతంది. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. గ్యాస్ట్రబుల్ను పోగోడుతుంది. కొవ్వు శాతాన్ని కరిగించి అధికబరువును, పొట్టను తగ్గిస్తుంది. శరీరములో చెడుగడ్డలను కరిగిస్తుంది. బీపిని స్థిరంగా ఉంచుతుంది. దీర్గకాలముగ వాడినట్లైతే చర్మవ్యాధులు సోరియాసిస్, పుండ్లు, కాలినగాయాలు, కుష్టు మరియు ఫైల్స్ లాంటివి నయమవుతాయి. ఊపిరితిత్తుల వ్యాధులు క్షయ, ఉబ్బసం, కామెర్లు మొదలగువాటిని నివారిస్తుంది. ఆకలిని పెంచుతుంది. అజీర్ణం, నులిపురుగులు, నిద్రపట్టకపోవటం, అధికనిద్ర వంటి సమస్యలు దూరమవుతాయి. మోకాళ్ళ నొప్పులు, రక్తలేమి, మూత్రపిండాలలో రాళ్లు, తీవ్ర హృద్రోగ సమస్యలకు లేత గోధుమ ఆకుల పౌడర్ దివ్యౌషదం. లోపాన్ని నివారిస్తుంది. లేత గోధుమ ఆకులరసం ఇటు ఔషధంగాను అటు పోషకాహారంగాను ఉపయోగపడుతుంది. ఆధునికయుగంలోనూ క్యాన్సర్, పక్షవాతం, ఎయిడ్స్ పేషంట్లకు రోగనిరోధక శక్తి పెరగటానికి వాడడం విశేషం.

లేత గోధుమ ఆకుల పౌడర్ ఆహారంగా తీసుకున్నట్లైతే జుట్టురాలటం, తెల్లబడటం తగ్గిస్తుంది. తైరాయిడ్ సమస్యలను పోగొడుతుంది. ఋతుసమస్యల నుండి స్త్రీలకు విముక్తి ఇంకా ఈ పౌడర్ ఫసే పాక్ లా వాడినట్లైతే ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఇది 100% ఆర్గానిక్ పౌడర్, కెమికల్స్ కలవనిది, సైడ్ ఎఫెక్ట్స్ లేనిది.

ఈ పౌడర్ ను ఎవరైనా, ఇతర మందులు వాడుతున్నా వాడవచ్చును. రెగ్యులర్ గా వాడినట్లైతే శరీరంలోని అన్ని భాగాలు నూతన శక్తిని సంతరించుకోవటం గమనిస్తారు. 1944 నుండి లేత గోధుమ ఆకుల వాడకంపై డా. విగ్ మోర్ మరియు డా. హిపోక్రటిస్ లాంటి మేధావులు ఆధ్వర్యంలో 350 రకాల అనారోగ్య సమస్యలపై పరిశోధనలు చేసి అధ్బుతమైన ఫలితాలు సాధించి, వారు రచించిన వై సఫర్ ఆన్సర్ వీట్ గ్రాస్ అనే పుస్తకంలో వివరించటం జరిగింది. మన దేశంలో దీని వాడకం బాగా ఎక్కువైంది. ఈ మధ్యకాలంలో పత్రికలలో, టి వి.లలొనూ, హొమియో, ఆయుర్వేద, ప్రకృతి వైద్య ప్రచారాల ద్వారా ఎక్కువగా ప్రస్తావనకు వచ్చింది. 

వాడేవిధానం: ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ పోవడేర్‌ను 200 ఎం. ఎల్, వెజిటబుల్ జ్యూస్‌లో తీసుకోవాలి లేదా ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ తేనె, ఒక నిమ్మకాయ మరియు గోధుమ గడ్డి పొడి కలుపుకొని త్రాగాలి లేదా మజ్జిగలో అయితే గోధుమ గడ్డి మరియు నిమ్మరసం కలుపుకుని త్రాగాలి లేదా ఫ్రూట్ జ్యూస్ లేదా గోరువెచ్చని పాలతో కలిపి త్రాగవచ్చును. తేనెతో కూడా వాడవచ్చును. వ్యాధి తీవ్రతను బట్టి సాయంత్రం కూడా తీసుకోవచ్చును. పౌడర్ తీసుకున్న తరువాత 1 గంట వరకు ఏమి తీసుకోరాదు.

సోయాతో ఆరోగ్యం : ప్రతిరోజు25 గ్రాముల సోయా మంసకృత్తులు తీసుకోవడం ద్వారా పలు రకాల క్యాన్సర్ లు మరియు ఇతర వ్యాధులు నుండి సమర్ధమైన రక్షణ పొడవచ్చును. ఇది చెడు కొలేస్ట్రాల్‌ను తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది. సోయా ఆహారం ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు మూత్ర సంబంధిత వ్యాధులను ఆరి కడుతుంది. క్రీడాకారులకు సోయా ఆహారం బలవర్ధకం మరియు శక్తిదాయకం. సోయా ఆహారంలో వున్న ఫ్యాటి యాసిడ్స్, రక్త ప్రసరణను, మెనోపాజ్ సమస్యలను క్రమబద్దం చేస్తాయి. ఇందులో వున్న పీచు పదార్ధం మధుమేహాన్ని అదుపు చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా ఉంచుతుంది. ఐరన్, క్యాల్షియమ్ అధికంగా ఉన్నందున సోయా గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు గొప్పవరం లాంటిది. బ్రెస్ట్ క్యాన్సర్ ను కూడ నివారిస్తుంది. సోయా ఆహారంలో లభ్యమయ్యే బేటా - కేరోటిన్ రేచీకటి సహా పలు కంటి జబ్బులను కూడా నివారిస్తుంది. 5 లీటర్ల పాలలో 1 కిలో మాంసంలో లేదా 24 గ్రడ్లలో దొరికే ప్రోటీన్ కేవలం 250 గ్రాముల సోయా ఆహారంలో లభిస్తుంది.

మనిషి ఆరోగ్యముగా ఉల్లాసముగా వుండాలంటే ఎలాంటి ఆహారము తీసుకోవాలి? ఎలాంటి దిన చర్య పాటించాలి? అధిక బరువు తగ్గాలన్నా, షుగరు వ్యాధిని అరికట్టాలన్నా అల్సర్లు రాకుండా ఉండాలన్నా, గ్యాస్, ఫైల్స్, మలబద్దకాన్ని అరికట్టాలంటే, ప్రకృతి ఆహారం క్రమబద్దంగా, నియమానుసారముగా పాటించినచో మీ ఆరోగ్యం మీ చేతులలో ఉండెలాగున చేయాలనే మా అభిలాషతో....

ప్రకృతి ఆహార నియమాల పట్టిక
1. ఉదయం 5 గంటలకు లేచి 1 1/2 లీటర్ నీరు త్రాగవలయును. తరువాత ధృష్టినంత పొట్టమీద వుంచి అటు ఇటు తిరిగినచో మల విసర్జన సులువుగా జరుగును.

2. ఆసనాలు కానీ, ప్రాణాయామము కానీ లేదా వాకింగ్ కానీ చెమట పట్టే పనికాని చేయాలి.  6 గంటలకు 1 1/2 నీరు మరల త్రాగవలయును. ఈ సారి నీరు నీరుగా మలవిసర్జన జరుగును. స్నానం చేసి, ధ్యానం చేసిన తరువాత

3. 7 గంటలకు వెజిటబుల్ జ్యూస్ త్రాగవలయును - క్యారెట్, బీట్ రూట్, కీర, టొమాటోలు, తులసి, కొత్తిమీర, కరివేపాకులతో జ్యూస్ చేసుకొని అందులో ఒక స్పూన్ తేనె, ఒక నిమ్మకాయ పిండుకొని త్రాగవలయును. షుగర్ ఉన్నవారు గోధుమ గడ్డి పొడి కలుపుకొని త్రగలి. (ఒక వేళ కీర లేకుంటే సొర, పొట్లకాయ, బూడిద గుమ్మడికాయ వాడవచును.)

4. మొలకెత్తించిన గింజలతోపాటు పండు ఖర్జూరము కానీ, పచ్చి మిరపకాని కలుపుకొని తినవచ్చును.

ఉ. 10.30 గం. లకు  రెండు గ్లాసుల నీరు త్రాగవలయును.
మ. 12.30 గం. లకు ముడీబియ్యం, ఆకుకూరలు, కాయగూరలు (ఉప్పు లేకుండా వండుకొని తినవలయును. ఉదా. గోంగూర 2 కట్టలు, పాలకూర 1 కట్ట, మేతి 1 కట్ట కలుపుకొని) బరువు తగ్గాలంటే గోధుమ రవ్వగాని, పుల్కాలు కాని తినాలి.
మ. 3. గం. లకు ఒక గ్లాస్ నీరు త్రాగాలి.
మ. 3.30. గం. లకు కమల, బత్తాయి జ్యూస్ త్రాగవలయును.
సా. 5.30 గం. లకు 1/2 లీటరు నీరు త్రాగాలి.
సా. 6.30 గం. లకు పుల్కాతో కాయకూరలు తిని జామ, బొప్పాయి, నేరేడుపళ్లు, రేగుపళ్లు, దానిమ్మ తిన్నచో హాయిగా వుండును.

 
All copy Rights Reserved Designed by Futuristic